ఘోర రోడ్డు ప్రమాదం : లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
కృష్ణా : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు పరిపాటిగా మారిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పుతున్నారు. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లే.. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు మార్గంమధ్యలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జాతీయ రహదారిపై డివైడర్ ను తాకి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారు మూడు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.