Three Killed In Road Accident : పంజాబ్ లో లారీని ఢీకొట్టిన రెండు కార్లు.. భార్యాభర్తలు సహా కుమారుడు మృతి

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెహరమ్ నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద లారీ డ్రైవర్ మేజర్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Three Killed In Road Accident : పంజాబ్ లో లారీని ఢీకొట్టిన రెండు కార్లు.. భార్యాభర్తలు సహా కుమారుడు మృతి

Three Killed In Road Accident

Updated On : September 13, 2022 / 4:53 PM IST

Three Killed In Road Accident : పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెహరమ్ నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ముందున్న వెహికిల్ ను తప్పించబోయి లారీ యూటర్న్ తీసుకుంది. అతివేగంతో వచ్చిన రెండు కార్లు లారీని బలంగా ఢీకొట్టాయి. దీంతో స్పాట్ లోనే భార్యాభర్త, కుమారుడు మృతి చెందారు. లారీ బోల్తా పడడంతో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.

పంజాబ్‌లోని బెహ్రామ్ వద్ద ఫగ్వారా, చండీగఢ్‌లను కలిపే జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. లోడ్ తో వెళ్తోన్న 18 చక్రాల భారీ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయి వాహనం బోల్తా పడింది. దీంతో అందులోని వస్తువులు రోడ్డుపై పడ్డాయి. ఈ క్రమంలో ఫగ్వారా నుండి వచ్చే రెండు కార్లు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టాయి.

Road Accident Two Killed : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తండ్రీకొడుకులు మృతి

దీంతో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. కారులో ఉన్న దంపతులు, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద లారీ డ్రైవర్ మేజర్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.