Gang Rape : పాతికేళ్ల మహిళపై గ్యాంగ్ రేప్…హత్య….. ముగ్గురు అరెస్ట్

పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది.

Gang Rape : పాతికేళ్ల మహిళపై గ్యాంగ్ రేప్…హత్య….. ముగ్గురు అరెస్ట్

Gangrape Murder

Updated On : April 21, 2021 / 4:15 PM IST

Gujarat : Three men arrested for gang rape and murder of 25 yearsa old woman : పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది. నగరంలో ఓల్డ్ సిటీలో ఏప్రిల్ 17వ తేదీన తీవ్రగాయాలపాలైన పాతికేళ్ళ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 18వ తేదీన మృతురాలి భర్త తన భార్య శవాన్ని గుర్తించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ తల, ప్రైవేట్ భాగాలలో తీవ్ర గాయాలైనట్లు….అత్యాచారం జరిగినట్లు, డ్రగ్స్ సేవించినట్లు వైద్యులు నివేదికలో తెలిపారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 19వ తేదీ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

బాధిత మహిళ(25), ఆమె భర్త రోజువారి కూలీలుగా పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఏప్రిల్ 17వతేదీ ఉదయం బాధిత మహిళ కూలి పని కోసం వెళుతుండగా ముగ్గురు నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకు తీసుకువెళ్లారు.

అక్కడినుంచి ఆమెను సమీపంలోని ఖాళీగా ఉన్న భవనంలోకి తీసుకు వెళ్లి ఆమెకు డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనతో మహిళ కన్నుమూసింది. నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ (376 డి), హత్య (302), అపహరణ (362) మరియు నేరపూరిత కుట్ర (120 బి)ల కింద కేసు నమోదు చేసినట్లు అహ్మాదాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎంఏ పటేల్ చెప్పారు.