Road Accident : విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి మూడేళ్ల బాలుడు మృతి

డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Road Accident : విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి మూడేళ్ల బాలుడు మృతి

Road Accident (1)

Updated On : April 15, 2023 / 7:44 AM IST

Road Accident : విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి ఓ బాలుడు మృతి చెందాడు. మామిడి కాయల లోడ్ తో వెళ్తోన్న లారీ.. విజయవాడ బెంజ్ సర్కిల్ లోని రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జీ దగ్గర బోల్తా పడింది. స్క్రూ బ్రిడ్జీ నుంచి లారీ బోల్తా పడింది. దీంతో మూడేళ్ల బాలుడు మామిడికాయల కింద చిక్కుకుపోయాడు.  బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా శ్రమించి మామిడికాయల కింది చిక్కుకున్న బాలుడిని బయటకు తీశారు. చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఇక తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్, క్లీనర్ ను రక్షించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Road Accident : ఉత్తరప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి

అయితే, డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైద్యులు బాలుడికి సరిగా చికిత్స అందించలేదని ఆరోపణలు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.