తెలంగాణలో మరో దారుణం : గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది.

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 04:46 AM IST
తెలంగాణలో మరో దారుణం : గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య

Updated On : February 22, 2020 / 4:46 AM IST

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది. మృతురాలని మన్నెగూడెంకు చెందిన జ్యోతిగా గుర్తించారు. కురవి జాతరకు వెళ్లి వస్తుండగా జ్యోతిపై దుండగులు దాడి చేశారు. అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. బొడ్రాయి తండాకు చెందిన రమేష్ అనే వ్యక్తిపై జ్యోతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో మహిళలను గ్యాంగ్ రేప్ చేసి పాశవికంగా హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

శుక్రవారం(ఫిబ్రవరి 21,2020) సాయంత్రం ఈ ఘటన జరిగింది. రమేష్ అనే వ్యక్తి జ్యోతిని బైక్ పై ఎక్కించుకుని వెళ్లడాన్ని గ్రామస్తులు చూశారు. ఇద్దరూ జాతరకు వెళ్లి తిరిగొస్తుండా ఈ దారుణం జరిగింది. ఈ అఘాయిత్యం వెనుక రమేష్ హస్తం ఉందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ దురాఘతానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. గిరిజన మహిళ సామూహిక హత్యాచారం స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. మహిళలకు రక్షణ కరువైంది. నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చానా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డ.. తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అత్యాచారం కేసుల్లో దోషులను ఉరి తీస్తున్నా, ఎన్ కౌంటర్ చేస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Read More>>కొవ్వు కరిగించుకోవటానికి పోలీసులు జుంబా డ్యాన్స్: వైరల్ వీడియో

See Also>>ప్రాణం తీసిన టీవీ సీరియల్… మంటల్లో చిక్కుకుని మహిళ మృతి