గొంతు కోసి ముగ్గురి హత్య
కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు.

కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు.
కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు. ముగ్గురిని హత మార్చింది బాలయ్య సోదరుడు రవిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల బాలయ్య కుమార్తె లత ప్రేమ వివాహం చేసుకుంది. అదే ఈ హత్యలకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
లత ప్రేమ వివాహాన్ని రవి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయంలో అన్న బాలయ్యతో అనేక సార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆస్తి గొడవలు పెరిగాయి. నిందితుడు రవి పక్కా ప్లాన్ ప్రకారం బాలయ్య, చందన, లతను దోమకొండలోని మల్లయ్య దేవాలయానికి రప్పించాడు.
అక్కడ వారితో బలవంతంగా పురుగుల మందు తాగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత బ్లేడుతో ముగ్గురి గొంతు కోసి దారుణంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రవి పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అతడ్ని అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు.