రోడ్డు ప్రమాదం: ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి
షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
చేవెళ్ల : షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు దుర్మరణం చెందారు. ఓ సీరియల్ చిత్రీకరణలో భాగంగా కొంత మంది ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రోడక్షన్ యూనిట్ కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తోంది. మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది.
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్
దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో నిర్మల్ ప్రాంతానికి చెందిన భార్గవి (20) అక్కడికక్కడే మరణించగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. కారు డ్రైవర్ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు మొయినాబాద్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.తెల్లవారుఝూము సమయం కావటంతో డ్రయివర్ నిద్రమత్తు కూడా కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.