గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లారు : ఇద్దరు మృతి ఏడుగురికి తీవ్రగాయాలు
గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు.

గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు.
గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు. హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్దులు దుర్మరణం పాలవ్వగా మరో 7 గురికి తీవ్రగాయాలయ్యాయి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గురువారం రాత్రి మాదాపూర్ నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న 9 మంది విద్యార్ధులు బర్త్ డే పార్టీకోసం హాస్టల్ లో చెప్పకుండా క్యాంపస్ గోడ దూకి బయటకు వెళ్లారు. శంషాబాద్ లో బర్త్ డే పార్టీ ముగించుకుని హాస్టల్ కు తిరిగి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న టీఎస్ 07ఈబీ3680 సఫారి కారు ప్రమాదానికి గురైంది. సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పిన కారు అరాంఘర్ చౌరస్తాలో పిల్లర్ నెంబర్ 211ను కారు ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో విద్యార్థులు తరుణ్(19), ఉదయ్(19) అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో శశాంక్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో సఫారీ కారు నుజ్జునుజ్జు అవడం చూస్తే ఓవర్ స్పీడ్ కారణంగానే కారు కంట్రోల్ తప్పి.. యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. వీరంతా మాదాపూర్‌లోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. కాగా… నారాయణ కాలేజీ సిబ్బంది విద్యార్ధుల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.