Murder Attack : అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దాడి
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ నజీర్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

Murder Attack On Asst Professor
Murder Attack : హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ నజీర్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నమాజ్ కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆటోలో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దుండగులదాడిలో గాయపడిన అహ్మద్ ను చూసిన స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మహమ్మద్ నజీర్ కోటి ఉమెన్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారని… ఆ కోణంలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.