Uttar Pradesh: పెళ్లిలో రసగుల్లా కోసం గొడవ.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

పెళ్లిలో రసగుల్లాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. విందు భోజనంలో రసగుల్లాలు సరిపడినంతగా లేకపోవడంతో వధూవరుల తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది.

Uttar Pradesh: పెళ్లిలో రసగుల్లా కోసం గొడవ.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

Updated On : October 28, 2022 / 8:38 AM IST

Uttar Pradesh: పెళ్లిలో రసగుల్లా విషయంలో తలెత్తిన గొడవ ఒకరి మరణానికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రాలో బుధవారం సాయంత్రం జావెద్, రషీద్ అనే సోదరులకు ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరిగింది.

Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

పెళ్లి అనంతరం రాత్రి విందు భోజనం ఏర్పాటు చేశారు. అయితే, విందులో రసగుల్లా స్వీట్లు సరిపడినంతగా లేవు. దీంతో ఈ విషయంలో వధువు తరఫు బంధువులు, వరుడి తరఫు బంధువుల మధ్య వాగ్వాదం మొదలైంది. అది గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఘర్షణ పెద్దదై, ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. చివరకు కత్తులు తీసుకుని, ఒకరిని ఒకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కత్తిపోట్లతో గాయపడ్డ నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

అయితే, చికిత్స పొందుతూ సన్నీ అనే 20 ఏళ్ల యువకుడు మరణించాడు. మరో ముగ్గురు ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. సన్నీ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు.