Ganja In Watermelon : బాబోయ్… పుచ్చకాయలు ఇందుకు కూడా వాడతారా…..!
మీకు పుచ్చకాయ ఇచ్చారనుకోండి.... ఏమి చేస్తారు,, కోసుకుని తింటారు. కాదంటే జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇంకొంచెం జాగ్రత్త పరులైతే పుచ్చగింజలు తీసి తర్వాత వాటిని కూడా వాడుకుంటారు.

Water Melon
Ganja In Watermelon : మీకు పుచ్చకాయ ఇచ్చారనుకోండి…. ఏమి చేస్తారు,, కోసుకుని తింటారు. కాదంటే జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇంకొంచెం జాగ్రత్త పరులైతే పుచ్చగింజలు తీసి తర్వాత వాటిని కూడా వాడుకుంటారు. కానీ వీళ్లను చూడండి పుచ్చకాయలను ఎలా వాడేశారో అది తెలిస్తే ….అమ్మో అని పారిపోవటమే..
ఒక వ్యాన్ నిండా పుచ్చకాయలు వేసుకుని అమ్ముకుంటూ వెళుతున్న ఒక ముఠాను పోలీసులు అనుమానం వచ్చి ఆపి చెక్ చేశారు. అంతే ఒక్క దెబ్బకు షాక్ కు గురయ్యారు పోలీసులు. పుచ్చకాయలలో ఎర్రగా పండిన గుజ్జు వంటి పదార్ధాన్ని తీసి, ఖాళీగా ఉన్న పుచ్చకాయ డిప్పలలో గంజాయి నింపిన కవర్లు పెట్టి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెడిట్ అనే వెబ్ సైట్ లో ఓ యూజర్ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. బాబోయ్ పుచ్చకాయలు ఇందుకు కూడా వాడతారా….. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడనే సామెత లాగా స్మగ్లర్లు తెలివి మీరి పోయారనుకుంటున్నారు.