అడ్డుగా ఉన్నాడని : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 26న సజీవదహనం అయిన రమేష్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను చంపేసింది.

హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 26న సజీవదహనం అయిన రమేష్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను చంపేసింది.
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌కేడీ నగర్‌లో నవంబర్ 26న సజీవదహనం అయిన రమేష్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య స్వప్న చంపడానికి ప్లాన్ చేసింది. స్వప్న చెప్పిన విధంగానే ఆమె ప్రియుడు వెంకటయ్య పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లు షార్ట్ సర్క్యూట్ జరిగి తన భర్త చనిపోయాడని స్వప్న పోలీసులకు తెలిపింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా స్వప్న ప్రియుడు వెంకటయ్యను గుర్తించిన పోలీసులు .. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తండ్రి మరణం, తల్లి జైలుపాలు కావడంతో .. పిల్లలు అనాధలుగా మారారు.