ఐపీఎస్ సాధించలేదని : మహిళ ఆత్మహత్య

జీవితంలో అనుకున్నది సాధించలేక పోయానన్న మనస్ధాపంతో హైదరాహాద్ లో ఓ వివాహిత సూసైడ్ చేసుకుది..

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 05:42 AM IST
ఐపీఎస్ సాధించలేదని : మహిళ ఆత్మహత్య

జీవితంలో అనుకున్నది సాధించలేక పోయానన్న మనస్ధాపంతో హైదరాహాద్ లో ఓ వివాహిత సూసైడ్ చేసుకుది..

హైదరాబాద్: హైదరాబాద్ చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చిన్నతనంలోనే ఇష్టంలేని పెళ్లి చేయటం వల్ల, జీవితంలో తాను అనుకున్నది సాధించలేక పోయాననే మనస్తాపంతో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది.  నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన గీతాంజలి (26)కి ఉన్నత చదువులు చదివి ఐపీఎస్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆమెకు తన లక్ష్యం నెర వేరక పోవటంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. తనకంటే వయస్సులో 14 ఏళ్ల పెద్దైన వ్యక్తితో 16 ఏళ్లకే పెద్దలు వివాహాం చేశారు.  భర్తి శంకర్ మహారాష్ట్రలోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.
పెళ్ళయినప్పటికీ కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే స్వస్ధలమైన నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చి చైతన్యపురిలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఎస్సై  పరీక్షలకు కోచింగ్  తీసుకుంటోంది. సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన గీతాంజలి పిల్లలను పుట్టింటిలోనే వదిలి శుక్రవారం హైదరాబాద్ తిరిగి వచ్చింది.  జీవితంలో తను అనుకున్నది ఏదీ సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు తల్లితండ్రులు, భర్తే కారణం అని సూసైడ్ నోట్ లో పేర్కోంది. “నేను జీవితంలో ఉన్నత చదువులు చదివి మంచి  ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని  భర్తతో కలిసి తిరగాలనుకున్నా కానీ  చిన్న వయస్సులోనే పెళ్లి చేయటంతో  ఇంటర్ లోనే చదువు ఆపాల్సి వచ్చింది.  జీవితంలో చాలా కోల్పోయాను. తల్లి తండ్రులెవరూ బాల్యవివాహాలు చేయకండి.” అని  సూసైడ్ లెటర్ రాసి గీతాంజలి చనిపోయింది. ఘటనా స్ధలానికి చేరుకున్నపోలీసులు మృత దేహాన్ని  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.