పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్న మహిళ : పంజాగుట్టలో కలకలం

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 12:45 PM IST
పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్న మహిళ : పంజాగుట్టలో కలకలం

Updated On : December 31, 2019 / 12:45 PM IST

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం(డిసెంబర్ 31,2019) ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆమెని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

నిప్పు అంటించుకున్న మహిళను లోకేశ్వరిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లోకేశ్వరి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.