వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె అరెస్ట్.. బెయిల్ పై విడుదల

వైసీపీ రాజ్యసభ్య ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తెను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని బీసెంట్ నగర్ వరదరాజసాలైలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న

వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె అరెస్ట్.. బెయిల్ పై విడుదల

YCP MP Beda Mastan Daughter Madhuri

YCP MP Beda MastanRao Daughter Madhuri Arrest : వైసీపీ రాజ్యసభ్య ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తెను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని బీసెంట్ నగర్ వరదరాజసాలైలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వృత్తిరిత్యా పెయింటర్ సూర్య (22) అనే యువకుడిపై కారు దూసుళ్లడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతుంది వైసీపీ రాజ్యసభ ఎంపీ కూమార్తె మాధురిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : ఏపీలో ఇంట‌ర్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. వారికి మాత్ర‌మే..!

ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారును నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో సహా పారిపోయారు. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన స్థానికులతో గొడవకు దిగి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు మహిళలు మద్యం సేవించి ఉన్నారని మృతుని బంధువులు ఆరోపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా ఫుటేజ్, కారు రిజిస్ట్రేషన్ నెంబర్, పారిపోయిన మహిళల ఫొటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.

Also Read : Director Teja : ‘పోలీస్ వారి హెచ్చరిక’ అంటున్న డైరెక్టర్ తేజ..

ఈ ప్రమాదానికి ప్రధానకారణమైన వైసీపీ ఎంపీ కుమార్తె మాధురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కొద్దిసేపటికే బెయిల్ మంజూరు కావటంతో స్టేషన్ నుంచి విడుదలయ్యారు.  ప్రమాదం జరిగిన తరువాత మాధురి స్నేహితురాలు స్థానికంగా ఉన్నవారితో వాగ్వివాదంకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.