Stabbed To Death : నెల్లూరులో యువకుడి దారుణ హత్య
నెల్లూరులోని మన్సూర్ నగర్‌లో అల్తాఫ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారని సమాచారం.

Stabbed to death
Stabbed To Death : నెల్లూరులోని మన్సూర్ నగర్‌లో అల్తాఫ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారని సమాచారం. వెంకటేశ్వరపురం కు చెందిన అల్తాఫ్.. నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ, ఖాళీగా ఉన్న టైమ్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గురువారం మధ్యాహ్నం అల్తాఫ్ బైక్ పై మన్సూర్‌నగర్‌కి వచ్చాడు. అయితే అక్కడ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అల్తాఫ్‌పై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అల్తాఫ్ మృతికి ప్రేమ వ్యవహారం కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Also Read : One Wife, Two Husbands : ఇద్దరు పిల్లల తల్లి-ఇద్దరు భర్తల భార్య- పెళ్ళాం కోసం భర్తల గొడవ
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకును హత్య చేశారన్న సమాచారం విన్న అల్తాఫ్ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.