Recruitment Of Teaching Staff : ఏపీలోని వివిధ యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీ

స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించకుండానే విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేస్తారు.

Recruitment Of Teaching Staff : ఏపీలోని వివిధ యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీ

Recruitment Of Teaching Staff :

Updated On : November 1, 2023 / 4:13 PM IST

Recruitment Of Teaching Staff : ఏపీలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయ నుండగా వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.

READ ALSO : APSRTC Apprentice Recruitment : ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉండనుంది. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి నిబంధనల ప్రకారం పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

READ ALSO : AIIMS Gorakhpur Recruitment : ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లోనాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రితోపాటు, పీహెచ్‌డీ తప్పనిసరిగా ఉండాలి. లేదా యూజీసీ నెట్/ ఏపీ స్లెట్/ఏపీసెట్ అర్హత కలిగి ఉండాలి. అకడమిక్/రిసెర్చ్ అనుభవం, పబ్లికేషన్స్ ఉండాలి. లేదంటే పీహెచ్‌డీతోపాటు GATE / GPAT / CEED అర్హత ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులువుతారు.

READ ALSO : fasting : 110 రోజులు కఠిన ఉపవాసం చేసిన బాలిక .. ఎందుకో తెలుసా..?

యూనివర్శిటీల వారీగా పోస్టుల వివరాలు ;

1. ఆంధ్రయూనివర్సిటీ (AU)-523
2. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)-265
3. ఆచార్య శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ANU)-175
4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)-219
5. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (AKNU)- 99
6. యోగివేమన యూనివర్సిటీ (YVU)- 118
7. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (Dr.BRAU)-99
8. విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU)-106

READ ALSO : Rice Borer : వరిలో సుడిదోమ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

9. కృష్ణా యూనివర్సిటీ (KRU)-86
10. రాయలసీమ యూనివర్సిటీ (RU)- 103
11. జేఎన్‌టీయూ కాకినాడ (JNTU K)- 98
12. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU A)-203
13. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU GV)-138
14. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV)-103
15. ద్రవీడియన్ యూనివర్సిటీ (DU)-24
16. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (Dr.AHUU)-63
17. డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (Dr.YSRA&F)-138
18. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్-ఏపీ (RGUKT)-660

READ ALSO : Nutritional Deficiencies in Women : మహిళల్లో కనిపించే 5 సాధారణ పోషక లోపాలు…లక్షణాలు, పరిష్కారాలు

నియామక ప్రక్రియ, వేతనాలు ;

స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించకుండానే విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేస్తారు. ఎంపికైన వారికి వేతనానికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 – రూ.1,82,400 చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 – రూ.2,17,100 చెల్లిస్తారు. ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 – రూ.2,18,200 చెల్లిస్తారు.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

దరఖాస్తు ఫీజు ;

అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.2500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2000 చెల్లించాలి. ఓవర్‌సీస్ అభ్యర్థులు 50 అమెరికన్ డాలర్లు లేదా రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు వేర్వేరుగా ఫీజు చెల్లించాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3000. ఓవర్‌సీస్ అభ్యర్థులు 100 అమెరికన్ డాలర్లు లేదా రూ.8,400 చెల్లించాలి. ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3000. ఓవర్‌సీస్ అభ్యర్థులు 150 అమెరికన్ డాలర్లు లేదా రూ.12,600 చెల్లించాలి.

READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

దరఖాస్తు ప్రక్రియ ;

దరఖాస్తు విధానానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 20.11.2023.గా నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది 27.11.2023గా నిర్ణయించారు.