బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ లో మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం మెయిల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ కావాల్సి ఉంటుంది.
వయస్సు: అభ్యర్ధులు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: SC, ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 11, 2019.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 25, 2019.
Read Also: అప్లై చేసుకోండి: కేంద్ర బలగాల్లో SI, ASI పోస్టులు