AAICLAS Recruitment 2023 : డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు…ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.

AAICLAS Recruitment 2023 : డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు…ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు

AAICLAS Recruitment 2023

AAICLAS Recruitment 2023 : ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో సెక్యూరిటీ స్క్రీనర్ (Security Screener) పోస్టుల భర్తీ చేపట్టనుంది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ (Contract Jobs) ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 906 పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Salman Khan : చిరిగిన బూట్లతో సల్మాన్ ఖాన్.. సింప్లిసిటీని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్

గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి 60 శాతం మార్కులతో జనరల్ అభ్యర్ధులు 55 శాతం మార్కులతో ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు ;

సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులు మొత్తం ఖాళీలు: 906

అర్హత:

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి కనీసం జనరల్ అభ్యర్థులకు 60శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదంటే స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

READ ALSO : Vishwambhara : మారేడుమిల్లి అడవుల్లో చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్.. సెట్స్ నుంచి ఫోటో లీక్..

వయోపరిమితి:

27 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు ఫీజు:

జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.

READ ALSO : Minister KTR : హైదరాబాద్ అభివృద్ధి రజినీకాంత్ కు అర్థమైంది కానీ, ఇక్కడున్న గజినీలకు అర్థం కావడం లేదు : మంత్రి కేటీఆర్

దరఖాస్తు విధానం:

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

డిగ్రీ మార్కులు, కంటి పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

READ ALSO : Gangula Kamalakar : ఆంధ్రోళ్లు మళ్లీ వస్తున్నారు.. షర్మిల, పవన్, పాల్‌పై గంగుల సంచలన వ్యాఖ్యలు

పని ప్రదేశం :

చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుపతి, రాయ్‌పుర్, వైజాగ్, ఇండోర్, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, డెహ్రాడూన్, పుణె, సూరత్, లేహ్ శ్రీనగర్, పాట్నా పనిచేయాల్సి ఉంటుంది.

జీతం :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.

READ ALSO : Vignan University V-SAT 2024 : విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు వీశాట్-2024 దరఖాస్తుల ఆహ్వానం !

దరఖాస్తు సమయంలో అభ్యర్ధులకు కావాల్సిన పత్రాలు ;

పదోతరతి/హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్

గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్/ డిగ్రీ మార్కుల మెమో లేదంటే డిగ్రీ ప్రొవిజిన్ సర్టిఫికేట్

క్యాస్ట్ సర్టిఫికేట్

ఆధార్ కార్డ్ కాపీ

పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో

స్కానింగ్ చేసిన అభ్యర్థి సంతకం(20 KB లోపు ఉండాలి)

READ ALSO : Air pollution : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. కళ్లలో మంట, శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.12.2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aaiclas.aero/ పరిశీలించగలరు.