AIIMS Bhopal : ఎయిమ్స్ భోపాల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సీబీటీ పరీక్ష విధానానికి సంబంధించి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.

AIIMS Bhopal : ఎయిమ్స్ భోపాల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

AIIMS Bhopal Recruitment

Updated On : October 29, 2023 / 4:58 PM IST

AIIMS Bhopal : భోపాల్‌లోని ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 357 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Erra Shekar : కాంగ్రెస్‌కు షాక్.. అనూహ్యంగా కారు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే

ఖాళీల వివరాలు ;

పోస్టుల వారీగా ఖాళీలకు సంబంధించి హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III: 106 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-II: 41 ,మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 38 పోస్టులు, ఫార్మసిస్ట్ గ్రేడ్-II: 27 పోస్టులు, వైర్‌మ్యాన్: 20 పోస్టులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II :18 పోస్టులు, ప్లంబర్: 15 పోస్టులు, కళాకారుడు (మోడలర్): 14 పోస్టులు, క్యాషియర్: 13 పోస్టులు, ఆపరేటర్ (E&M)/ లిఫ్ట్ ఆపరేటర్: 12 పోస్టులు, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్: 05 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Renu Desai : పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

వీటితోపాటు మానిఫోల్డ్ టెక్నీషియన్ (గ్యాస్‌స్టీవార్డ్) / గ్యాస్ కీపర్: 06, ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు, మెకానికల్ (ఏసీ & రిఫ్రిజిరేటర్): 06 పోస్టులు, డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్-2: 05 పోస్టులు, అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్: 04 పోస్టులు, డిస్పెన్సింగ్ అటెండెంట్స్: 04 పోస్టులు,మెకానిక్ (E & M): 04 పోస్టులు, లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్-2: 03 పోస్టులు, గ్యాస్/ పంప్ మెకానిక్: 02 పోస్టులు, లైన్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు, ఫార్మా కెమిస్ట్/కెమికల్ ఎగ్జామినర్: 01 పోస్టు, కోడింగ్ క్లర్క్: 01 పోస్టు,మ్యానిఫోల్డ్ రూమ్ అటెండెంట్: 01 పోస్టు ఉన్నాయి.

READ ALSO : Kerala Blast: కేరళలో 20 నిమిషాల్లో మూడు పేలుళ్లు.. ప్రార్థనలో 2,000 మంది.. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే?

అర్హతలు ;

నిబంధనలు అనుసరించి పదవతరగతి, ఇంటర్ , డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆయా పోస్టులకు అనుగుణంగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, డిఫెన్స్ పర్సన్స్‌కు 3-8 సంవత్సరాలు, వితంతు/ఒంటరి/విడాకులు పొందిన మహిళలకు 35-40 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వ సివిలియన్ అభ్యర్థులకు 40-45 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

READ ALSO : KTR : కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన.. తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం : మంత్రి కేటీఆర్

ఎంపిక ప్రక్రియ , దరఖాస్తు విధానం ;

కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సీబీటీ పరీక్ష విధానానికి సంబంధించి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి.

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsbhopal.edu.in/