నేటితో APECET-2019 దరఖాస్తుకు ఆఖరు

ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019-20 సంవత్సరానికి వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకుగాను JNTU అనంతపురం నిర్వహించనున్న ‘APECET-2019’ పరీక్షకు దరఖాస్తు గడువు నేటితో (మార్చి 27, 2019) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రూ.550 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాచ్చు. అయితే రేపటి నుంచి రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
* ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..’ఏపీఈసెట్-2019′
విద్యా అర్హత :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం BE, B-TECH, B-Pharmacy కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. డిప్లొమా, డిగ్రీ (మ్యాథమెటిక్స్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Read Also : మెట్రో జోష్ : స్టేషన్ టూ స్టేషన్ ట్రిప్ పాస్ లు