JOBS : బెంగళూరు నీమ్ హాన్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్ డబ్ల్యూ, బీఓటీ, ఎంఓటీ, ఎంఫిల్, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

Nimhans Bengaluru (1)
JOBS : భారత ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సీనియర్ సోషల్ వర్కర్ అండ్ కౌన్సెలర్ 1 పోస్టు, పల్లియేటివ్ కేర్ ఏఎస్ఎల్ పీ 1ఖాళీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 1 ఖాళీ, జూనియర్ సోషల్ వర్కర్ 2 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్ డబ్ల్యూ, బీఓటీ, ఎంఓటీ, ఎంఫిల్, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 నుండి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానికి సంబంధించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్య్వూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జులై 26, 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; పరిశీలించగలరు.