బాసర త్రిపుల్ ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2019, ఏప్రిల్ 29 నుంచి మే 24వ తేదీ వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు త్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హత కలిగి ఉంటారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లకు మించరాదు. మొత్తం సీట్లలో రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు విడతలవారీగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
Also Read : అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక