చెక్ ఇట్: ఢిల్లీ మెట్రో ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 04:28 AM IST
చెక్ ఇట్: ఢిల్లీ మెట్రో ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

Updated On : January 4, 2020 / 4:28 AM IST

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 1493 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు. 

అసలు షెడ్యూల్ ప్రకారం.. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తు గడువును మరో వారంపాటు పెంచుతున్నట్లు DMRC తెలిపింది. జనవరి 20 అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.  

ఆసక్తిగల అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇందుకు అభ్యర్ధులు 18  నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. సంబంధిత విభాగంలో BE, B-TECH, ఫైనాస్ విభాగంలో CA, ICWA, LAW విభాగంలో LLB, ఇంజనీరింగ్ డిప్లమా, డిగ్రీ, ఐటీఐ లో ఉత్తీర్ణులై ఉండాలి.