Job Vacancies : సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

Filling up of various job vacancies in Army Ordnance Corps Center, Secunderabad
Job Vacancies : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1749 ట్రేడ్స్‌మ్యాన్ మెట్, ఫైర్‌మ్యాన్ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలను పరిశీలిస్తే ట్రేడ్స్‌మ్యాన్ మెట్ పోస్టులు 1249, ఫైర్‌మ్యాన్ పోస్టులు 544 ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఫైర్‌మ్యాన్ పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aocrecruitment.gov.in/ పరిశీలించగలరు.