ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ పై నేవీలో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 08:05 AM IST
ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ పై నేవీలో ఉద్యోగాలు

Updated On : May 15, 2019 / 8:05 AM IST

దేశంలోని వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో నాన్ గెజిటెడ్, నాన్ ఇండస్ట్రీయల్ గ్రూప్-బీ చార్జ్ మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది. ఇందులో 103 మెకానిక్ పోస్టులు, 69 ఎక్స్ ప్లోజివ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 30 ఏళ్లు మించి వయసు ఉండకూడదు. 

విద్యా అర్హత :
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఫీజు:
SC, ST అభ్యర్ధులు, మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. మిగిలినవారు రూ.205 చెల్లించాలి.

దరఖాస్తు ప్రారంభం: మే 13, 2019

దరఖాస్తు చివరి తేదీ: మే 26, 2019