టైప్ కంటే చేతితో రాస్తేనే మంచిది.. పిల్లలు వేగంగా నేర్చుకుంటారు: అధ్యయనం

సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్ది విద్యా వ్యవస్థలో కూడా మార్పులు సహజంగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు అందుబాటులోకి రాగా.. చదువుకునే పద్దతులు రాసుకునే పద్దతులు కూడా మారిపోయాయి. దీని ప్రభావం పిల్లల చదువులపై కూడా ఎక్కువగా పడుతూ ఉందట. పుస్తకాల ప్లేసుల్లోకి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు రావడంతో చదువుకునే పరిస్థితులు మారిపోయాయి. సాధనాలు చేతుల్లోకి రావడంతో చేతిరాతకు బదులుగా కీ బోర్డ్‌లను వాడడం అలవాటుగా చేసుకుంటున్నారు విద్యార్ధులు. అయితే దీనిపై అధ్యయనాలు చెబుతున్న విషయాలు పిల్లల చదువుల విషయంలో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి.
కరోనా సమయంలో పిల్లలు రాయడానికి బదులుగా టైపింగ్ చేసుకోవడానికి ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే దాని వల్ల పిల్లలకు పెద్దగా ఉపయోగం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు వాస్తవానికి స్కూళ్లలో అయితే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా రాసుకుంటూ ఉంటారు. అయితే ఖచ్చితంగా, విషయాలను టైప్ చేయడం వేగంగా, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు చేతిరాత అయితే కుదరదు. టైపింగ్‌లో అయితే నీట్‌గా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కీబోర్డులో టైప్ చేయడం కంటే.. విద్యార్థులు చితిరాత రాసుకోవడం వల్లే పిల్లలకు మేదస్సు పెరుగుతుంది అని అధ్యయనం చెబుతుంది. చక్కగా కుదిరించి రాసే వారికి ఎప్పటికీ విలువ ఉంటుందిని. ఎన్ని తెలివి తేటలు, ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా చేతిరాత ద్వారా రాసేటప్పుడే సగం సబ్జెక్ట్‌ని బుర్రలోకి ఎక్కించుకోవచ్చు అని చెబుతుంది అధ్యయనం.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 95 శాతం పైగా పరీక్షలు చేతిరాత ఆధారంగా జరుగుతాయి. చేతిరాత బాగున్న విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడం సర్వసాధారణం. యావరేజి విద్యార్థి కూడా మంచి రాతతో పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. సాధారణంగా పరీక్షల్లో పేపర్‌పై రాయడం మొదలైన కొద్దిసేపట్లోనే ఫ్లో తగ్గుతుంది. మెదడుకి, చేతికి మధ్య ఉండే సమన్వయం చేతిరాత. అటువంటి చేతిరాతను నిర్లక్ష్యం చేసి కీ బోర్డ్ ఆధారితంగా నోట్స్ రాసుకోవడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.
పోటీ ప్రపంచంలో పెద్ద పెద్ద రెఫరెన్స్ పుస్తకాలు చదవడం, ప్రింటెడ్ పుస్తకాలు, జిరాక్స్ కాపీలపై ఆధారపడటంతో మేథోశక్తి పెరుగుతున్నప్పటికీ రాయడం అనేది పరీక్షల్లో నెగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అధ్యయనం చెబుతుంది. నార్వేజియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం.. పిల్లలు చేతిరాత ద్వారా పాఠాలు రాసుకోవడం తప్పనిసరి చేయాలని టీచర్లకు చెబుతున్నారు.
ఇటీవలి అధ్యయనంలో పిల్లలలో మెదడు కార్యకలాపాలను పరిశీలించింది. మెదడు తరంగ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి మరియు రికార్డ్ చేయడానికి EEG పరిశోధకులను అనుమతించింది. EEG(electroencephalogram) ప్రొఫెసర్ ఆడ్రీ వాన్ డెర్ మీర్ మరియు ఆమె బృందం అధ్యయనం ప్రకారం, పిల్లలు మరియు యువకులలోని మెదళ్ళు కీబోర్డ్‌లో టైప్ చేయడానికి బదులుగా చేతితో రాసేటప్పుడు చాలా చురుకుగా ఉన్నట్లు చూపించాయి .
పెన్ మరియు కాగితం వాడకం వలన రాసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు అని అధ్యయనంలో తేలింది అని చెప్పారు. కాగితంపై పెన్ను నొక్కడం, వ్రాసే అక్షరాలను చూడటం మరియు వ్రాసేటప్పుడు మీరు చేసే శబ్దాన్ని వినడం ద్వారా చాలా ఇంద్రియాలు సక్రియం అవుతాయని, ఈ ఇంద్రియ అనుభవాలు మెదడు విధ భాగాల మధ్య సంబంధాన్ని సృష్టిస్తాయని, నేర్చుకోవటానికి మెదడును తెరుస్తాయని చెప్పారు.
అలాగని ఎలా పడితే అలా రాయకూడదు. కలిపిరాత లేదా విడిగా రాయడం ఎలాగైనా రాయండి.. కమ్యునికేషన్ క్లియర్‌గా ఉంటే చాలు. అంటే మనం రాసింది మనకు మళ్లీ చదువుకోవడానికి అర్థం అయ్యేలా.. పిల్లలకు టైపింగ్ అలవాటుగా అవుతుంటే మాత్రం చేతిరాత ప్రాముఖ్యతను వారికి తెలపండి. అలా అని టైపింగ్ అసలు తప్పు అంటే కాదు.. టైపింగ్ కూడా అవసరమే.. కానీ రెంటికి సమతుల్య ప్రాధాన్యత ఇవ్వాలనేది అధ్యయనంలో చెబుతున్న విషయం.