AP Forest Department Jobs: ఏపీ అటవీశాఖలో 100 పోస్టులకు నోటిఫికేషన్.. నెలకు రూ.32 వేల జీతం.. దరఖాస్తు, అర్హత, పుర్తి వివరాలు
AP Forest Department Jobs: అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

Notification released for the posts of Forest Section Officer in AP Forest Department
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 100 పోస్టులను భర్తీ చేయనున్నారు అధికారులు. దీనికి సంబందించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జులై 28 నుంచి ఆగస్టు 17 వరకు కొనసాగనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
విద్యార్హత:
వృక్షశాస్త్రం/ఫారెస్ట్/హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్/జియాలజీ/అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా ఉండి డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పట్టాదారుడై ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 01 జులై 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.250, పరీక్ష ఫీజు కోసం రూ.80 చెల్లించాల్సి ఉంటంది.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.రూ. 32,670 నుంచి రూ.1,01,970 మధ్య జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
అబ్యర్ధులకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా హాజరవ్వాల్సి ఉంటుంది.