Lenskart Jobs : లెన్స్ కార్ట్ లో 2వేలకు పైగా ఉద్యోగాల భర్తీ…ఎప్పుడంటే!..

ప్రస్తుతం లెన్స్ కార్ట్ సంస్ధలో 5వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రాంతీయ మార్కెట్ల విస్తరణ, బలోపేతం చేసే దిశగా దృష్టిసారించినట్లు లెన్స్ కార్ట్ వ్యవస్ధాపక సీఈఓ పీయూష్ బన్సల్ స్పష్టం చేశారు.

Lenskart Jobs : లెన్స్ కార్ట్ లో 2వేలకు పైగా ఉద్యోగాల భర్తీ…ఎప్పుడంటే!..

Lencekart

Updated On : August 12, 2021 / 2:51 PM IST

Lenskart Jobs : హైద్రాబాదుతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది మార్చినాటికి 2వేలకు పైగా ఉద్యోగ నియామకాలను చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు  ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్ కార్ట్ ప్రకటించింది. ప్రతిభ నైపుణ్యం కలిగిన యువతకు ఈ నియామకాల్లో పెద్దపీట వేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. పెరుగుతున్న స్టోర్ల నిర్వాహణకు సిబ్బందిని నియమించనుంది. హైద్రాబాద్ , ఎన్సీఆర్, బెంగళూరుల్లో 1500 పైగా రిటైల్ ఉద్యోగుల్ని, 100 మందికి పైగా ఇంజనీర్లను నియమించుకోనుంది.

టెక్నాలజీ , డాటా సైంటిస్టులు, డాటా ఇంజనీర్లు, వ్యాపార విశ్లేషకులు, నిపుణులను భర్తీ చేయనుంది. సింగపూర్ , పశ్చిమాసియా, అమెరికాల్లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను నియమించనుంది. తయారీ కార్యకలాపాలకోసం 100 మంది, ఫైనాన్స్, కన్జ్యూమర్ ఇన్ సైట్స్ , మానవవనరులు, మర్చండైజింగ్ తదితర కార్పోరేట్ అవసరాలకు గాను సిబ్బందిని భర్తీ చేయనుంది.

ప్రస్తుతం లెన్స్ కార్ట్ సంస్ధలో 5వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రాంతీయ మార్కెట్ల విస్తరణ, బలోపేతం చేసే దిశగా దృష్టిసారించినట్లు లెన్స్ కార్ట్ వ్యవస్ధాపక సీఈఓ పీయూష్ బన్సల్ స్పష్టం చేశారు. స్టోర్లను పెంచటంతోపాటు, ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆన్ లైన్ విక్రయాలు సాగిస్తున్నట్లు చెప్పిన ఆయన అంతర్జాతీయంగా సంస్ధ కార్యకలాపాలు ఆశాజనంగానే సాగుతున్నాయన్నారు. ప్రతిభావంతులకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.