ITBP Recruitment : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జిమినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

Recruitment of Constable Posts in Indo Tibetan Border Police Force
ITBP Recruitment : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ( యానిమల్ ట్రాన్స్ పోర్ట్) గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఖాళీల్లో పురుషులు 44 ఖాళీలు, మహిళలు 8 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జిమినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులు పంపేందుకు సెప్టెంబర్ 27, 2022ను ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://recruitment.itbpolice.in/ పరిశీలించగలరు.