Railway Recruitment : రైల్వే లో గ్రూప్ సి,డి పోస్టుల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ అర్హత కలిగినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Railway Recruitment : రైల్వే లో గ్రూప్ సి,డి పోస్టుల భర్తీ

Recruitment of Group C, D Posts in Railways

Updated On : December 27, 2022 / 3:10 PM IST

Railway Recruitment : భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి స్కౌట్స్, గైడ్స్ కోటాలో గ్రూప్ సి, డి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎస్‌ అండ్‌ టీ విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ అర్హత కలిగినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు గ్రూప్ డి పోస్టులకైతే 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rrcnr.org/ పరిశీలించగలరు.