CCL Recruitment : రాంచీ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లో మైనింగ్ సర్ధార్, ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీ
భర్తీ చేయనున్న పోస్టుల్లో మైనింగ్ సర్దార్ 77 ఖాళీలు, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ 126 ఖాళీలు, డిప్యూటీ సర్వేయర్ 204 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మాన్ టీ,ఎస్ 107 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

CCL Recruitment
CCL Recruitment : ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 330 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలన్నీ ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ అభ్యర్ధులకు స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ గా నిర్వహిస్తుంది.
READ ALSO : కంటి ఆరోగ్యం కోసం..
భర్తీ చేయనున్న పోస్టుల్లో మైనింగ్ సర్దార్ 77 ఖాళీలు, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ 126 ఖాళీలు, డిప్యూటీ సర్వేయర్ 204 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మాన్ టీ,ఎస్ 107 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ , డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ ల పరిశీలన అధారంగా ఉంటుంది.
READ ALSO : Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదిగా 19 ఏప్రిల్ 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.centralcoalfields.in/ పరిశీలించగలరు.