Recruitment of Trade Apprentice : సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ

భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రేడ్ అప్రెంటిస్ 536, ఫ్రెషర్ అప్రెంటిస్ 72 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ అప్రెంటిస్‌లకు పదోతరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

Recruitment of Trade Apprentice : సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Central Coalfields Limited

Updated On : May 27, 2023 / 3:05 PM IST

Recruitment of Trade Apprentice : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 608 ట్రేడ్ అప్రెంటిస్ అండ్ ఫ్రెషర్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Diabetes Diet : డయాబెటిస్‌కు దారితీసే ఆహారపు అలవాట్లు !

భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రేడ్ అప్రెంటిస్ 536, ఫ్రెషర్ అప్రెంటిస్ 72 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ అప్రెంటిస్‌లకు పదోతరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

READ ALSO : Micronutrient Deficiencies : సూక్ష్మపోషక లోపాలు.. సంకేతాలు, కారణాలు

అభ్యర్థులను మెరిట్ బేసిస్, రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ అనుసరించి రూ. 6,000, రూ. 7,000, రూ. 9,000 వరకు స్టైపెండ్ అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 18, 2023 తుదిగడువు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.centralcoalfields.in/ పరిశీలించగలరు.