Jobs : ఆర్ బి ఐలో 950 పోస్టుల భర్తీ
ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

Rbi
Jobs : ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా అసిస్టెంట్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొత్తం 950 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను మార్చి 26,27 తేదీలలో నిర్వహించనున్నారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను పంపేందుకు చివరి తేది మార్చి 8, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.rbi.org.in/