Assam Rifle : అసోం రైఫిల్ లో స్టోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

Assam Rifle : అసోం రైఫిల్ లో స్టోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ

Assam Rifle

Updated On : March 28, 2022 / 10:47 AM IST

Assam Rifle : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో రైఫిల్‌ మ్యాన్‌, రైఫిల్‌ ఉమెన్‌ జనరల్ డ్యూటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి బాక్సింగ్ 21, ఫుట్ బాల్ 20, రోయింగ్ 18, ఆర్చెరీ15, క్రాస్‌కంట్రీ10, అథ్లెటిక్స్‌10, పోలో10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా పోటీలు,ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌,నేషనల్‌ స్పోర్ట్స్‌లో పాల్గొని ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విధానం విషయానికి వస్తే ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, అచీవ్‌మెంట్స్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్‌ అభ్యర్ధులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్‌ 30,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.assamrifles.gov.in/ సంప్రదించగలరు.