SBI Jobs: ఎస్బీఐలో ఉద్యోగాలు.. 2వేల 964 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..
ఈ నెల 29వ తేదీ వరకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 364 బ్యాక్ లాగ్ పోస్టులతో 2వేల 964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్ లో 233, అమరావతి సర్కిల్ పరిధిలో 186 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు ఏదైనా బ్యాంకులో రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. 2025 ఏప్రిల్ 30 నాటికి 21-35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ నెల 29వ తేదీ వరకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
Also Read: భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం జరిగి ఉంటేనా..? ఆ యుద్ధాన్ని ఇలా ఆపాను: ట్రంప్
ఎంపిక ప్రక్రియ..
ఆన్‌లైన్ టెస్ట్
స్క్రీనింగ్
ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ టెస్ట్‌లో 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్
50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి.
ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.
అభ్యర్థులు తమ డిస్క్రిప్టివ్ టెస్ట్ సమాధానాలను కంప్యూటర్‌లో టైప్ చేయాలి.
ఆబ్జెక్టివ్ టెస్ట్ వ్యవధి 2 గంటలు
మొత్తం 120 మార్కులు, 4 విభాగాలు
ప్రతి విభాగానికి ప్రత్యేక సమయం ఉంటుంది.
డిస్క్రిప్టివ్ టెస్ట్ వ్యవధి 30 నిమిషాలు.
మొత్తం 50 మార్కులకు రెండు ప్రశ్నలతో కూడిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ & ఎస్సే) పరీక్ష.
అప్లికేషన్ ఫీజు..
General/ EWS/OBC కేటగిరికి- 750రూపాయలు
SC/ ST/ PwBD కేటగిరి అభ్యర్థులకు ఫీజు లేదు..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. క్లిక్ చేయండి..
అప్లయ్ చేయడానికి డైరెక్ట్ లింక్.. క్లిక్ చేయండి..