తెలంగాణలో 10th వాల్యూయేషన్ స్టార్ట్

  • Published By: madhu ,Published On : April 15, 2019 / 03:40 PM IST
తెలంగాణలో 10th వాల్యూయేషన్ స్టార్ట్

Updated On : April 15, 2019 / 3:40 PM IST

తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నుంచి వాల్యూయేషన్ ప్రారంభం అయ్యింది. తెలంగాణా SSC బోర్డు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్..  స్థానిక ఎన్నికల విధులు ఒకేసారి ప్రారంభం కావాడంతో ఉపాద్యాయులు ఏ విధుల్ని నిర్వహించాలనే ఆందోళనల నేపధ్యంలో బోర్డు మాత్రం ఎటువంటి ఆటంకం కలగకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా డ్యూటీలు వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

నిన్న మొన్నటి వరకు ఎన్నికల డ్యూటీల్లో బిజీగా ఉన్న ఉపాధ్యాయులకు ఈసారి స్థానిక ఎన్నికల డ్యూటి.. స్పాట్ వాల్యూయేషన్ రెండు ఒకేసారి రావడంతో డబుల్ డ్యూటీలు పడ్డట్లు అయ్యింది. అయితే ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ ప్రారంభం కావడంతో బోర్డు ఉపాద్యాయులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా డ్యూటీలు వేశారు అధికారులు. 
టెన్త్ వాల్యూయేషన్ వాయిదా వేయలేని పరిస్థితి ఉండటంతో రెండింటిని బాలెన్స్ చేస్తూ ఉద్యోగం చేయాల్సి వస్తోందని అంటున్నారు ఉపాధ్యాయులు.

మరోవైపు టెన్త్ ఫలితాలు సకాలంలో ఇవ్వకపోతే బోర్డు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎన్నికల విధులున్న రోజు వాల్యుయేషన్ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా డ్యూటీలు వేశారని చెబుతోంది పాఠశాల విద్యాశాఖ. దీంతో రెండు డ్యూటీలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఉపాధ్యాయులకి. ఏప్రిల్ 27వ తేది వరకు 10th వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.