Indian Railways Recruitment : ఇండియన్ రైల్వేస్ లో భర్తీ కాకుండా ఉన్న 2.48 లక్షల ఉద్యోగ ఖాళీలు

భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌ల పరిధిలోని ఖాళీల సంఖ్యలను పరిశీలిస్తే గ్రూప్ ‘ఎ’ & ‘బి’లో 2070 పోస్టులు ఖాళీగా ఉండగా, లెవెల్-1 స్థానాలతో సహా గ్రూప్ ‘సి’లో దాదాపు 2,48,895 ఖాళీలు ఉన్నాయి. వివిధ స్థాయిలలోని ఖాళీలను భర్తీకి సమగ్ర రిక్రూట్‌మెంట్ విధానం అవసరాన్ని ఈ ఖాళీలు గుర్తు చేస్తున్నాయి.

Indian Railways Recruitment : ఇండియన్ రైల్వేస్ లో భర్తీ కాకుండా ఉన్న 2.48 లక్షల ఉద్యోగ ఖాళీలు

Indian Railways Recruitment

Updated On : August 27, 2023 / 10:36 AM IST

Indian Railways Recruitment : భారతీయ రైల్వేల చక్రాలు దేశం యొక్క జీవనాధారంగా కీర్తించబడతున్నాయి. దేశాన్ని ఉత్తరం నుండి దక్షిణం మరియు తూర్పు నుండి పడమర వరకు కలుపటంలో రైల్వేది కీలక పాత్ర. భారతీయ రైల్వేల పటిష్టమైన పనితీరు సమర్థవంతమైన రవాణాకే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి కూడా కీలకం. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల చేసిన ప్రకటనలో, రైల్వేలు గణనీయమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జోన్‌లు , విభాగాల్లో 2.5 లక్షలకు పైగా ఖాళీలు ఉద్యోగల భర్తీ కోసం ఎదురు చూస్తున్నాయి.

భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌ల పరిధిలోని ఖాళీల సంఖ్యలను పరిశీలిస్తే గ్రూప్ ‘ఎ’ & ‘బి’లో 2070 పోస్టులు ఖాళీగా ఉండగా, లెవెల్-1 స్థానాలతో సహా గ్రూప్ ‘సి’లో దాదాపు 2,48,895 ఖాళీలు ఉన్నాయి. వివిధ స్థాయిలలోని ఖాళీలను భర్తీకి సమగ్ర రిక్రూట్‌మెంట్ విధానం అవసరాన్ని ఈ ఖాళీలు గుర్తు చేస్తున్నాయి.

వివిధ జోన్‌లలో పోస్ట్ వైజ్ గా ఖాళీల వివరాలు ;

Indian Railways

Indian Railways

 

భారతీయ రైల్వేలో ఉద్యోగ ఖాళీలకు ఎలా దరఖాస్తు చేయాలి?

ఇండియన్ రైల్వేస్ టీమ్‌లో మీరు కూడా భాగస్వాములు కావాలన్న ఆసక్తి ఉంటే భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే ఉాద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలనే దానిపై దశల వారీగా అనుసరించాల్సిన పద్దతులు..

దశ 1: అధికారిక వెబ్‌సైట్‌ www.indianrailways.gov.in ను సందర్శించండి

మీ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి, అధికారిక భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ www.indianrailways.gov.in ను ఓపెన్ చేయండి. రైల్వే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇది ఒక ప్లాట్‌ఫారమ్, ఇక్కడ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన సమాచారం ఇతర అప్‌డేట్‌ల వివరాలు ఉంటాయి.

దశ 2: నోటిఫికేషన్ చదవటం

వెబ్‌సైట్‌లో, ‘రిక్రూట్‌మెంట్’ , ‘కెరీర్’ విభాగంపై క్లిక్ చేయండి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌లను పరిశీలించాలి. నోటిఫికేషన్‌లో ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుములు మరియు ముఖ్యమైన తేదీలు వంటి అన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి వాటిని పూర్తిగా చదవడం చాలా ముఖ్యం.

దశ 3: అర్హతలను పరిశీలించటం

నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు అవసరమైన విద్యార్హతలు, వయో పరిమితులు , ఆసక్తి ఉన్న పోస్టులు ఉన్నాయో చూడండి.

దశ 4: దరఖాస్తు చేయటం, లాగిన్ చేయటం

కొత్త దరఖాస్తుదారు అయితే ముందుగా రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, ఇతర సమాచారం,ఇమెయిల్ చిరునామా వంటి ప్రాథమిక వివరాలను అందించాలి. మీరు గతంలో భారతీయ రైల్వే స్థానాలకు దరఖాస్తు చేసి ఉంటే, ఇప్పటికే ఉన్న మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయాల్సి ఉంటుంది.

దశ 5: దరఖాస్తు ఫారమ్‌ను పూరించటం

వివరాలు నమోదు చేసి లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్ చేయవచ్చు. అవసరమైన అన్ని వివరాలను ఖచ్చితంగా పూరించాలి. ఇందులో వ్యక్తిగత సమాచారం, విద్యా అర్హతలు, పని అనుభవం, దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న ఏదైనా ఇతర సమాచారం పూర్తిగా నింపాలి.

దశ 6: పత్రాలను అప్‌లోడ్ చేయటం

ఉద్యోగ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం, విద్యా ధృవీకరణ పత్రాలు, గుర్తింపు పత్రాలు అప్ లోడ్ చేసే వాటిలో ఉంటాయి. స్కాన్ చేసిన కాపీలు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

దశ 7: దరఖాస్తు రుసుము చెల్లించటం

రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా దరఖాస్తు రుసుము ఉంటే, నోటిఫికేషన్‌లో అందించిన సూచనల ప్రకారం దాన్ని చెల్లించాలి. చెల్లింపు సాధారణంగా వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

దశ 8: సమీక్షించి సమర్పించండి

చివరిగా దరఖాస్తును సమర్పించే ముందు, నమోదు చేసిన మొత్తం సమాచారాన్ని, అప్‌లోడ్ చేసిన పత్రాలను సరిచూసుకునేందుకు కొంత సమయం కేటాయించండి. లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోండి. ప్రతిదీ ఖచ్చితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత సబ్ మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.

స్టెప్ 9: అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేయండి

విజయవంతంగా దరఖాస్తును సబ్ మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్‌తో పాటు నిర్ధారణ సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. ఈ అప్లికేషన్ నంబర్‌ను స్క్రీన్‌షాట్‌ను తీసుకోండి. భవిష్యత్ లో ఇది చాలా అవసరం.