తెలంగాణలో పాలిసెట్ కు సర్వం సిద్ధం

తెలంగాణలో పాలిసెట్-2019 కు సర్వం సిద్ధమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16 మంగళవారం నిర్వహించనున్న పాలిసెట్-2019 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 6 వేల 380 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 63 వేల 70 మంది, బాలికలు 43 వేల 310 మంది ఉన్నారు. 48 పట్టణాల పరిధిలో 320 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమంతిచనున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.