Karnataka Polls: కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ విమర్శలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్‌వేర్/మెకానిజమ్‌ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు

Congress X ECI: కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక(Karnataka Assembly Election)ల్లో ఈవీఎంల పునర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘా(Election Commission)నికి రాసిన లేఖలో కాంగ్రెస్ (Congress) ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను గతంలో దక్షిణాఫ్రికాలో కూడా రీవాలిడేషన్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా ఉపయోగించారని లేఖలో కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ దక్షిణాఫ్రికాకు ఈవీఎంలు పంపలేదని, దక్షిణాఫ్రికా ఈవీఎంలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది.
ఇదిలావుండగా, కర్ణాటక ఎన్నికలలో ఈవీఎంల కదలికలపై ప్రతి విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిధులకు సమాచారం అందించినట్లు ఎన్నికల సంఘం డేటా వెల్లడిస్తోంది. కర్ణాటకలో కొత్తగా ఈసీఐఎల్ ఉత్పత్తి చేసిన ఈవీఎంలను మాత్రమే ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా తెలుసని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
Gujarat: పుట్టిన రోజు తెలియకపోవడం వల్లే స్కూలుకు విద్యార్థులకు దూరం పెరగుతోంది.. ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఈసీకి రాసిన లేఖలో “గతంలో దక్షిణాఫ్రికాలో ఎన్నికల కోసం మోహరించిన ఈవీఎంలను మోహరించినందున ఆందోళన తలెత్తుతోంది. కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్‌వేర్/మెకానిజమ్‌ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. ఈసీఐ ద్వారా ధృవీకరణ పొందాయి. దీనిపై తీవ్రమైన సందేహాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
తమ ఎన్నికలలో వినియోగించుకునేందుకు తాము దక్షిణాఫ్రికాకు ఈవీఎంలను ఎప్పుడూ పంపలేదని, ఏ దేశం నుంచి ఈవీఎంలను ఈసీ దిగుమతి చేసుకోలేదని ఎన్నికల సంఘం తన రికార్డులో పేర్కొంది. వాస్తవానికి, దక్షిణాఫ్రికా ఎన్నికలలో అసలు ఈవీఎంలో ఉపయోగించరని, ఇది దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని జాతీయ, ప్రాంతీయ ఎన్నికల ఇలస్ట్రేటెడ్ బుక్‌లెట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.