Karnataka Polls: ఒటమి దిశగా సగం మంది మంత్రులు.. లెక్కింపులో వెనుకబడిన అగ్రనేతలు
జనతాదశ్ సెక్యూలర్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో విచిత్రంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. కాగా ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం.

Karnataka Assembly Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 30కి పైగా స్థానాల్లో ఆ పార్టీ వెనుకయబడిపోయింది (కౌంటింగ్ కొనసాగుతోంది). అయితే బీజేపీలో ప్రధానంగా ముఖ్య నేతలే ఒటమి దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. బసవరాజు బొమ్మై మంత్రివర్గంలోని దాదాపు సగం మంది నేతలు లెక్కింపులో వెనుకంజలో ఉన్నారు. ఉదయం 11:30 గంటల సమయం వరకు జరిగిన లెక్కింపు ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భారతీయ జనతా పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది.
Karnataka Polls: సీట్లలోనే కాదు, ఓట్లలోనూ కాంగ్రెస్ పార్టీ సరికొత్త దూకుడు.. కర్ణాటకలో హస్తం హవా
ఇక జనతాదశ్ సెక్యూలర్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో విచిత్రంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. కాగా ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం. ఇక గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ అయిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. అది కూడా గాలి జనార్ధన్ రెడ్డి పోటీ చేసిన స్థానమే. ఇది కాకుండా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో, సర్వోదయ కర్ణాటక పక్ష పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం కొనసాగిస్తున్నాయి.
ఇప్పటికి విడుదలైన ఫలితాల ప్రకారం.. కొందరి ముఖ్య నేతల ఫలితాలు ఇవి.
సిద్ధరామయ్య (కాంగ్రెస్) – ముందంజ
డీకే శికుమార్ (కాంగ్రెస్) – ముందంజ
బసవరాజు బొమ్మై (బీజేపీ-సీఎం) – ముందంజ
హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) – ముందంజ
లక్ష్మణ్ సంగప్ప సవాది (కాంగ్రెస్) – ముందంజ
సీటీ రవి (బీజేపీ) – ముందంజ
ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్) – ముందంజ
జగదీశ్ షెట్టర్ (కాంగ్రెస్) – వెనుకంజ
నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) – ముందంజ
విజయేంద్ర యడియూరప్ప (బీజేపీ) – వెనుకంజ
జీ.సోమేశ్వర్ రెడ్డి (బీజేపీ) – వెనుకంజ
జీ.కరుణాకర్ రెడ్డి (బీజేపీ) – వెనుకంజ
హెచ్డీ రేవణ్ణ (జేడీఎస్) – ముందంజ