తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్: మంత్రివర్గ ప్రక్షాళన.. తెర వెనుక ఏం జరుగుతోంది?

  • Published By: Mahesh T ,Published On : November 12, 2025 / 01:41 PM IST

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మంత్రివర్గంలో కీలక మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, ఆశావహుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణ మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త సంవత్సరం జనవరి నెలాఖరులోపు ఈ మార్పులు ఉండబోతున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

కొత్తగా ఇద్దరికి కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా సైలెంట్‌గా ఉండటానికి ఇదే కారణమని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి దక్కితే, ఆయన సామాజిక వర్గానికే చెందిన మధు యాష్కి గౌడ్‌కు పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.