పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? ప్రెగ్నెసీకి చలికాలమే సరైన సమయమంట, సైన్స్ చెప్పింది

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 07:59 AM IST
పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? ప్రెగ్నెసీకి చలికాలమే సరైన సమయమంట, సైన్స్ చెప్పింది

Updated On : August 12, 2020 / 8:23 PM IST

మీకు పెళ్లి అయిందా? పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. పిల్లల కోసం ప్రయత్నించేవారికి ఈ వింటర్ సీజన్ ఎంతో అనుకూలంగా ఉంటుందని అంటున్నారు సెక్సాలిజిస్టులు. సాధారణంగా చాలామంది దంపతులు.. పిల్లలను కనాలనే ఉత్సాహంతో ఎలాంటి పద్ధతులను ఫాలో అయితే త్వరగా కన్సీవ్ (గర్భం దాల్చడం) అనేదానిపై చాలా సందేహాలు ఉంటాయి.

ఆయా విషయాలపై ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. గర్భం దాల్చడం సులభమేనా? లేదా పిల్లలు కనేందుకు ఏది మంచి సమయం? అని సెర్చ్ చేస్తుంటారు. మరికొంతమంది అప్పుడే పిల్లలు ఎందుకు అని ఫ్యామిలీ ప్లానింగ్ వాయిదా వేస్తుంటారు. ఒకవేళ, మీరు పిల్లల కోసం ప్రయత్నాల్లో ఉంటే మాత్రం దానికి ఇదే ప్రత్యేకమైన సమయంగా చెప్పవచ్చు. వాస్తవానికి దంపతుల మధ్య రిలేషన్ పిష్‌లో లైంగిక సంబంధం అనేది ఎంతో ముఖ్యమైనది.

Children birth

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఎక్కువ :
ఇందులో మరిన్నో కారణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ నెలలో గర్భం దాల్చితే మంచిది అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి కన్సీవ్ అయ్యేందుకు కచ్చితమైన తేదీ, సమయం, నెల అంటూ ఏది ఉండదు. కొత్త అధ్యయనం ప్రకారం.. చాలామంది దంపతులు ఇతర సాధారణ నెలలతో పోలిస్తే.. వింటర్ సీజన్ నెలల్లోనే పిల్లల కోసం ప్రయత్నించి వారు ఎక్కువగా సక్సెస్ సాధించినట్టు రివీల్ చేసింది.

Baby during Winter

అందులోనూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఎక్కువగా చాలామంది పుట్టినతేదీలు ఉంటాయి. ఇతర నెలల్లో కంటే ఈ రెండు నెలల్లోనే చాలామంది పుట్టినట్టు అధ్యయనం చెబుతోంది. జనరల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. వింటర్ సీజన్ నెలలే ఎంతో అనుకూలమైన ఫలితాలు రాగా, అత్యధికంగా వింటర్ సీజన్ ప్రారంభంలో ఫలితాలు అద్భుతంగా ఉంటాయని హ్యుమన్ రీప్రొడక్షన్ గుర్తించింది.

పిల్లల ప్లానింగ్‌పై రీసెర్చర్ల బృందం 14,331 మంది తల్లిదండ్రులపై సర్వే నిర్వహించారు. వింటర్ సీజన్లలోనే బర్త్ రేట్లు పెరగడానికి గల కారణాలపై సర్వేను నిర్వహించారు. డెన్మార్క్, కెనడా, అమెరికాకు చెందిన మహిళల్లో ఆరు నెలల కంటే ఎక్కువ నుంచి చేసిన ప్రయత్నాలపై చెప్పిన డేటా ఆధారంగా అధ్యయనాన్ని రూపొందించారు.

Relationship

ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వేలో పాల్గొన్నవారిలో గర్భందాల్చే సమయం వరకు అన్ని అంశాలను ట్రాక్ చేశారు. అందులో ఫ్రీక్వెన్సీ ఇంటర్ కోర్సు, రుతక్రమం, ఓవ్యూలేషన్ (అండోత్పత్తి), వయస్సు వంటి అంశాలపై కూడా విశ్లేషిస్తారు. ఇవే కాకుండా.. ఇతర జీవనశైలి కారకాల్లో డైట్, స్మోకింగ్ అలవాట్లు, విద్య, ఆదాయం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ప్లానింగ్ లేకుండా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? 
అధ్యయనం ప్రకారం.. ఒక బేబీ కోసం ప్లానింగ్ చేయడం అవసరమని నిర్ణయించుకున్నప్పుడు అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, వారి వ్యక్తిత్వంపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇతర అధ్యయనాలతో పోలిస్తే.. ప్రెగ్నెన్సీ అందిన ఏడాది తేదీ నుంచి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. డైట్ లేదా ఇతర మానసిక కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
Health doctor

శాస్త్రీయంగా పరిశీలిస్తే.. పిల్లలు శీతాకాలం సీజన్ లోనే గర్భదారణ ప్లాన్ చేయడం వంటి ప్రయత్నాలు మెరుగైన ఫలితాలను రాబట్టినట్టు తెలిపారు. వేసవి సీజన్ తో పోలిస్తే శీతాకాల సీజన్ లోనే ప్రెగ్నెన్సీ రావడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది తల్లలు అభిప్రాయపడ్డారు. మిగిలినవారంతా వర్క్ షెడ్యూల్, ఫ్యామిలీ లైఫ్, ఇన్‌కమ్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని పేర్కొంది.

గర్భధారణకు చలికాలం మంచి సమయం :
2018 అధ్యయనం ప్రకారం.. శీతాకాలంలో పిల్లలు కనేందుకు మంచి సమయమని తెలిపింది. చల్లని వాతావరణం సమయంలో పురుషుల్లోని వీర్యం అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుందని పేర్కొంది. శరీరం బయట చల్లని ఉష్ణోగ్రతలో వీర్యంలోని శుక్రకణాలు ఎంతసేపు జీవించగలవు అనేదానిపై కూడా 10వ గ్రేడ్ సైన్స్ తో అంచనా వేయొచ్చునని తెలిపింది. ఇదే సీజన్ లో పుట్టిన పిల్లల్లో సర్వైవల్ రేట్ కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుదని పేర్కొంది.

pregnant

హెల్తీ ప్రెగెన్సీకి సరైన సమయంలోనే రొమాన్స్ :
మొత్తం మీద అర్థం చేసుకోవాల్సింది ఒకటే.. గర్భదారణ కోసం ప్రయత్నించే దంపతులు ప్రతిరోజు రొమాన్స్ లేదా సరైన సమయాల్లో కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల్లో ప్రత్యేకించి ఆండోత్పత్తి రోజుల్లో వీలైనంతగా కొత్త భంగిమల్లో రొమాన్స్ చేయడం ఎంతో ఉత్తమం. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాదు.. ఎంతో సులభంగానూ ఉంటుంది. తద్వారా ప్రెగ్నెన్సీ పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.

See Also | AK-47తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య