గుడ్ న్యూస్ : 14వేల కరోనా పేషెంట్లు కోలుకుంటున్నారట…డిశ్చార్జ్ కూడా

  • Published By: venkaiahnaidu ,Published On : February 19, 2020 / 11:06 AM IST
గుడ్ న్యూస్ : 14వేల కరోనా పేషెంట్లు కోలుకుంటున్నారట…డిశ్చార్జ్ కూడా

Updated On : February 19, 2020 / 11:06 AM IST

కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ వైరస్ దెబ్బకి రోజుకు వందల మంది చెప్పున చనిపోయారని,ఇప్పటివరకు దాదాపు 2వేల మంది మరణించినట్లు,75వేలమంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని మాత్రం మనం వారల్లో చూశాం,చదివారం.విన్నాం.

అయితే ఇక్కడ బయట ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఓ విషయం ఏంటంటే…చైనాలో కరోనా పేషెంట్లు తొందరగానే కోలుకుంటున్నారట. ఇప్పటికే 14వేలమంది వైరస్ పేషెంట్లు కోలుకున్నారంట. ఫిబ్రవరి-19,2020వరకు 14వేలమంది కరోనా సోకిన పేషెంట్లు కోలుకున్నట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. 

కరోనా వైరస్ నుంచి కోలుకుని,యాంగ్యాంగ్(28)అనే మహిళ వూహాన్ లోని నెం.7హాస్పిటల్ లో డిశ్చార్జ్ అయిన తర్వాత మొదటిసారిగా తన కోసం గుడ్లు,టమోటాలతో ఓ కర్రీ చేసుకుంది. ఇదే ఓ కరోనా బాధిత వ్యక్తి బయటికొచ్చి సొంతంగా తయారుచేసుకున్న డిష్. మొదటిసారి తాను చాలా రుచికరంగా ఉన్నట్లు భావించినట్లు యాంగ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

హాస్పిటల్స్ లో ఇంకా వైరస్ తో ఫైట్ చేస్తున్న మిగిలిన స్నేహితులందరని చూడటానికి నేను వేచి ఉండలేను! అంటూ యాంగ్యాంగ్ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేసింది. కరోనాను చావు దగ్గరి అనుభవంగా యాంగ్యాంగ్ వర్ణించింది. వూహాన్ లో వైరస్ తో పోరాడుతూ కోలుకుంటున్న 14వేలమందిలో యాంగ్యాంగ్ ఒకరు.

సోమవారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అడ్హనోమ్ మాట్లాడుతూ…చైనా మెడికల్ డేటా ప్రకారం ప్రతి ఐదుగురు కరోనా వైరస్ పేషెంట్లలో నలుగరు కోలుకుంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే చైనాలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హుబే ఫ్రావిన్స్ లో కోలుకుంటున్న వారి శాతం 15గానే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఫిబ్రవరి-19,2020నాటికి దాదాపు 40శాతం మంది కోలుకున్నట్లు సమాచారం