37రోజుల వరకు రోగి శరీరంలో కరోనా వైరస్ జీవించగలదట

37వరకు కరోనా వైరస్ మీ శరీరంలో జీవించగలదట.లాన్సెంట్ మెడికల్ జర్నల్ లో బుధవారం ప్రచురించిన ఒక కొత్త స్టడీ ప్రకారం...కొరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసిం

37రోజుల వరకు రోగి శరీరంలో కరోనా వైరస్ జీవించగలదట

Corona Virus In Body

Updated On : October 29, 2021 / 11:18 AM IST

37వరకు కరోనా వైరస్ మీ శరీరంలో జీవించగలదట.లాన్సెంట్ మెడికల్ జర్నల్ లో బుధవారం ప్రచురించిన ఒక కొత్త స్టడీ ప్రకారం…కొరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసించినట్లు కనుగొనబడింది. కొంతమంది రోగులకు యాంటీవైరల్ మందులు వచ్చాయి కానీ వైరస్ యొక్క ఆయుష్షును తగ్గించడానికి మందులు కనిపించలేదు.

ఈ స్డడీని తీసుకొచ్చిన 19 మంది డాక్టర్లు… చైనాలోని 191 మంది రోగుల (జిన్నింటన్ హాస్పిటల్ నుండి 135 మరియు వుహాన్ పల్మనరీ హాస్పిటల్ నుండి 56) మెడికల్ రికార్డులను విశ్లేషించారు. ఇందులో డిశ్చార్జ్ అయిన 137 కరోనా వైరస్ రోగుల మరియు హాస్పిటల్ లో చనిపోయిన 54మంది పేషెంట్ల లేబరేటరీ డేటా, క్లినికల్, డెమోగ్రఫిక్ డేటా కూడా ఉన్నాయి.

తీవ్రమైన వ్యాధి స్థితి ఉన్న రోగుల శరీరాల్లో సగటున 19 రోజులు, మరియు క్రిటికల్ డిసీస్ స్టేటస్ ఉన్న రోగుల శరీరాల్లో సగటున 24 రోజులు ఈ వైరస్ ఉందని వారు కనుగొన్నారు. మొత్తంమీద, చివరికి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రోగులలో సగటున 20 రోజులు వైరస్ కనుగొనబడింది. మరణించిన రోగుల శ్వాస మార్గాలలో, కరోనావైరస్ మరణం వరకు గుర్తించబడింది

ప్రాణాలతో బయటపడిన వారి శ్వాసకోశంలో వైరస్ నివసించిన అతి తక్కువ సమయం ఎనిమిది రోజులు. చాలా షాకింగ్ విషమేమిటంటే.. కొన్ని సందర్భాల్లో, వైరస్ 37 రోజుల వరకు కొనసాగింది. ఇది  రోగిని ఐసొలేషన్ చేసే నిర్ణయం తీసుకోవడం మరియు యాంటీవైరల్ ట్రీట్మెంట్ పొడవు చుట్టూ… రెండింటికీ ఇది ముఖ్యమైన చిక్కులను కలిగి ఉందని స్డడీ ఆథర్స్ తేల్చారు.

See Also | రూ.500కోట్ల ఖర్చుతో 300 అడుగుల సమాధిలో కరోనా శవాలు