Cashew Nuts Benefits: రోజూ జీడిపప్పు తింటున్నారా.. కానీ, ఎంత మోతాదులో తినాలో తెలుసా.. ఇవి తప్పకుండా పాటించాలి
Cashew Nuts Benefits: జీడిపప్పులలో మోనో-అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది.

Health benefits of eating Cashew Nuts
జీడిపప్పులు అనేది సాధారణంగా చాలా మంది వంటకాలలో ఉపయోగించే అత్యంత రుచికరమైన డ్రై ఫ్రూట్. దీనిని రోజు తినడం వల్ల శరీరానికి పోషక విలువలను అందిస్తుంది. అయితే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ డ్రై ఫ్రూట్ ను రోజు తినడం మంచిదేనా? దీనిని తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అనేది చాలా మందిలో ఉన్న సందేహం. మరి ఇప్పుడు జీడిపప్పుల వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటి? అధికంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పులో ఉండే పోషక విలువలు:
కాలరీలు: 157 kcal, ప్రొటీన్లు: 5 గ్రా, మెత్తని కొవ్వులు: 12 గ్రా, ఫైబర్: 1 గ్రా, ఐరన్: 11%, మ్యాగ్నీషియం: 20%, జింక్, ఫాస్ఫరస్, విటమిన్ B6, విటమిన్ Eలు కూడా ఉంటాయి.
జీడిపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
1.హృదయ ఆరోగ్యానికి మేలైనవి:
జీడిపప్పులలో మోనో-అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి మంచి(HDL) పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
2.మెదడు పనితీరుకు బలాన్ని ఇస్తాయి:
జీడిపప్పులలో మెగ్నీషియం, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ E మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల మానసిక ఉల్లాసం, మూడ్ స్టెబిలిటీ ఏర్పడుతుంది.
3.ఎముకల బలానికి అవసరమైన మినరల్స్:
జీడిపప్పులలో కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం శరీరానికి ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణానికి అవసరం. ఇది ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడటం) నివారించడంలో సహాయపడుతుంది.
4.రక్తహీనత నివారణలో సహాయం:
జీడిపప్పులలో ఐరన్, కాపర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అమెనియా ఉన్నవారికి మితంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
5.ఇమ్మ్యూనిటీ బలపర్చే ఆహారం:
వీటిలో జింక్, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు కలవటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది.
6.కణాల మరమ్మతు, డిఎన్‌ఏ స్టెబిలిటీకి అవసరం:
జీడిపప్పులలో ఉండే మినరల్స్ సెల్యులర్ హెల్త్ మెయింటెన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జీడిపప్పులు తినే సరైన మోతాదు ఎంత?
రోజుకి 5 నుంచి 8 జీడిపప్పులు తినొచ్చు. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు చేయొచ్చు.
ఎలా తినాలి?
- ఉదయం అల్పాహారంలో లేదా స్నాక్‌ల రూపంలో తినవచ్చు.
- పప్పు పొడి, కూరలు, చాట్, సాలడ్‌ల్లో కూడా కలిపి తీసుకోవచ్చు.
- పాయసం, కీర్ లాంటి డిజర్ట్స్‌లో ఉపయోగించవచ్చు – అయితే మోతాదు జాగ్రత్తగా చూసుకోవాలి.
జీడిపప్పులు ఆరోగ్యానికి మంచివే, కానీ మితంగా తినడం అవసరం. ఇవి శరీరానికి శక్తిని, పోషకాలను అందించడంలో కీలకంగా పనిచేస్తాయి. అధికంగా తింటే మాత్రం వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయి. కావున, నిత్యజీవితంలో జీడిపప్పులను సరియైన రీతిలో, పరిమితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.