Health Tips: గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం.. ముందే తెలుసుకోండి
Health Tips: గంటలపాటు కుర్చీలో ఒత్తిడిగా కూర్చోవడం వల్ల వెన్నెముక నెమ్మదిగా దెబ్బతింటుంది. సరిగ్గా సపోర్ట్ లేని కుర్చీ, వంగిన కౌలింగ్ పొజిషన్ల కారణంగా మెడ నొప్పులు, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి.

Health problems caused by working sitting for hours
ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్‌ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం అనివార్యంగా మారింది. IT ఉద్యోగాలు, డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, ఆఫీస్ వర్క్ లాంటి పనులు ఎక్కువసేపు కూర్చొని చేయాల్సినవే. అయితే, మొదట్లో ఇది పెద్ద సమస్యలా అనిపించకపోవచ్చు కానీ, దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలు ఏంటి? దాని కోసం ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.వెన్నెముక, మెడ నొప్పులు:
గంటలపాటు కుర్చీలో ఒత్తిడిగా కూర్చోవడం వల్ల వెన్నెముక నెమ్మదిగా దెబ్బతింటుంది. సరిగ్గా సపోర్ట్ లేని కుర్చీ, వంగిన కౌలింగ్ పొజిషన్ల కారణంగా మెడ నొప్పులు, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా స్పోండిలైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
2.హృదయ సంబంధిత వ్యాధులు;
శారీరక కదలిక లేకుండా కూర్చోవడం వల్ల రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. ఇది బాడీ మాస్ ఇండెక్స్ పెరగడానికి కారణం అవుతుంది. దీనివల్ల అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధుల వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పరిశోధనల ప్రకారం, రోజుకు 6 నుంచి 8 గంటల కంటే ఎక్కువ కూర్చొనేవారిలో హృదయ సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుందట.
3.మధుమేహం, స్థూలకాయం:
ఎక్కువసేపు కూర్చునే ఉండటం వల్ల శరీరం అవసరమైన ఇన్సులిన్‌ను ఉపయోగించలేకపోతుంది. ఇది టైప్-2 మధుమేహానికి దారి తీస్తుంది. అదే విధంగా, రోజూ కదలకుండా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతూ స్థూలత్వం (obesity) వస్తుంది. దీనివల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు, థైరాయిడ్, PCOS వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
4.మానసిక ఒత్తిడి, మానసిక ఆరోగ్యం పై ప్రభావం:
ఎక్కువసేపు కూర్చిని పనిచేయడం, కదలికలు లేకపోవడం అనేది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆనంద హార్మోన్లు సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన పెరుగుతాయి. పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఉత్సాహం లేకపోవడం వంటి ఫలితాలు కనిపిస్తాయి.
5.కంటికి సంబంధించిన సమస్యలు:
కంప్యూటర్ స్క్రీన్‌కి దగ్గరగా ఎక్కువసేపు చూస్తే డిజిటల్ ఐ స్ట్రెయిన్ వస్తుంది. దీని వల్ల కళ్లలో మంట, తలనొప్పి, దృష్టి మసకబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలంలో ఇది మయోపియాకి దారి తీస్తుంది.
చిన్న మార్పులు, గొప్ప ఫలితాలు:
- ప్రతి గంటకోసారి లేచి నడవండి
- కుర్చీలో సరిగ్గా కూర్చునే విధానం (Posture) పాటించండి
- స్క్రీన్ నుంచి ప్రతి 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకన్లపాటు దృష్టిని తిప్పండి
- డెస్క్ వద్ద చిన్న వ్యాయామాలు చేయండి
- సరైన భోజనం, తగినంత నీరు మంచిది
- రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయండి.