వారంలో ఆస్పత్రి నిర్మాణం సాధ్యమేనా? కరోనా బాధితులకు చైనా ఏం చేస్తోంది?

ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ తీవ్రమైపోతోంది. వేలాది మందికి ఈ వైరస్ సోకింది. వందాలది మంది వైరస్ సోకి మృతిచెందారు. ఇప్పటివరకూ 132 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వుహాన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్.. ఎక్కువ శాతం అక్కడివారిపైనే తీవ్ర ప్రభావం పడింది. వైరస్ సోకిన చాలామందికి చికిత్స, వైద్య సౌకర్యాలు అందించడంలో చైనా తర్జనభర్జన పడుతోంది.
ఇప్పటికే చైనా ప్రభుత్వం సరైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. వైరస్ బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన వనరులను అత్యంత వేగంగా ఏర్పాటు చేస్తోంది. వారంలోగా ఆస్పత్రి నిర్మించే పనుల్లో నిమగ్నమైంది. మహహ్మారి వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో చైనా ప్రభుత్వం సాధ్యమైనంత తొందరలో ఆస్పత్రి నిర్మించాలని భావిస్తోంది.
రోజురోజుకీ వైరస్ బాధితులు పెరిగిపోతుండటంతో వారికి వసతితో పాటు వైద్య సదుపాయాలు కల్పించడంలో తలమునకలవుతోంది. చైనాలో కరోనా బాధితుల కోసం నిర్మిస్తున్న అత్యవసర ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ఇంజినీరింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
ఆస్పత్రి నిర్మాణం కోసం చైనా చేస్తున్న రోజువారీ ఏర్పాట్లకు సంబంధించి వీడియాలను మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. చైనాలోని స్థానిక మీడియా ఒకటి డ్రోన్ ఫుటేజ్ ఒకటి విడుదల చేసింది. వుహాన్ సిటీలోని ఓ విశాలమైన ప్రదేశంలో జరుగుతున్న ఆస్పత్రి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో వీడియోలో చూడొచ్చు.
1000 పడకలతో ఆస్పత్రి నిర్మాణం :
నిర్మాణ ప్రదేశంలో బుల్డెజర్స్, ట్రక్కులు, సిమెంట్, పవర్ జనరేటర్లు ఇలా మరెన్నో పనుల్లో నిమగ్నమయ్యాయి. అత్యవసర ఆస్పత్రి నిర్మాణం కోసం అక్కడి వర్కర్లు 24 గంటలు శ్రమించి నిర్దేశించిన సమయంలోగా పూర్తి అయ్యేలా ప్రయత్నిస్తున్నారు.
జనవరి 24న దెబ్బతిన్న హుషెన్‌షాన్ ఆస్పత్రి మరమ్మత్తుల అనంతరం ఫిబ్రవరి 3నుంచి పనిచేయనుంది. సిటీలోని ఈ ఆస్పత్రి 1,000 పడకలు, 269,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మరోవైపు లీషెన్షన్ హాస్పిటల్ 323,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో సమానంగా ఉండనుంది. ఇందులో 1,300 పడకల సౌకర్యం రెండు రోజుల తరువాత నుంచి అందుబాటులోకి రానుంది.
తక్కువ వ్యవధిలో నిర్మాణం సురక్షితమేనా? :
వుహాన్ సిటీలో ఎమర్జెన్సీ ఆస్పత్రి నిర్మాణంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో చైనా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయగలదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి వంటి ఒక నిర్మాణభవనంలో పూర్తి స్థాయిలో వైద్య సాంకేతికత పరికరాలతో సేవలు అందించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి ఆధునిక టెక్నాలజీతో ఆస్పత్రిని నిర్మించాలంటే ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. అలాంటి భవన నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయడం ఎంతవరకు సురక్షితం అనే సందేహం అందరిలో రాకమానదు.
దీనిపై గ్లోబల్ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సంస్థ HOK హెల్త్‌కేర్ ప్రాక్టీస్‌కు సారథ్యం వహించే ఆర్కిటెక్చర్ స్కాట్ రావ్లింగ్స్ మాట్లాడుతూ.. చైనీయులు నిర్మిస్తున్నది ఒక సాధారణ వైద్య సదుపాయం కాదని అన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేలాదిమందికి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న చికిత్స కేంద్రం మాత్రమే’ అని స్పష్టం చేశారు.‘వుహాన్ సిటీలో నిర్మించే ఆస్పత్రి (పర్మినెంట్ హాస్పటిల్) స్థిరంగా అలానే ఉంటుందని నేను అనుకోవడం లేదు.
Read Also : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!
అది ఖచ్చితంగా పూర్తి-సేవ సౌకర్యం కాదు’ అని రావ్లింగ్స్ తెలిపారు. భవనం ఉపయోగం, దాని అనుకూలతను 75 సంవత్సరాల వరకు ఎలా ఉంటుందో పరిశీలిస్తాం. వుహాన్‌లో తన కొత్త ఆస్పత్రిని రూపొందించడంలో చైనాకు ఆ లగ్జరీ లేదన్నారు. ప్రస్తుతం చెంగ్డులోని కొత్త, 500 పడకల ఆస్పత్రితో పాటు హాంకాంగ్‌లోని రెండు ఆస్పత్రుల్లో నిర్మాణ పనుల్లో అందరితో రావ్లింగ్స్ సంప్రదింపులు జరుపుతున్నారు.
కస్టమ్ డిజైన్ కోసం సంప్రదింపులకు సమయం లేకపోవడంతో, వుహాన్ అధికారులు 2003లో SARS మహమ్మారి సోకిన సమయంలో బీజింగ్ శివార్లలో 1,000 పడకల సౌకర్యంతో జియాటాంగ్షాన్ ఆస్పత్రిని ఒక వారంలో పూర్తి చేశారు. ఆ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి బ్లూప్రింట్లను ఉపయోగిస్తున్నారు.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!