కరోనా నుంచి కోలుకోవాలంటే అసలు ఎన్ని రోజులు పడుతుంది? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

  • Published By: sreehari ,Published On : August 15, 2020 / 01:09 PM IST
కరోనా నుంచి కోలుకోవాలంటే అసలు ఎన్ని రోజులు పడుతుంది? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Updated On : August 15, 2020 / 4:09 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాల కంటే వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య అత్యధిక శాతంగా ఉన్నారు.. COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. అయినప్పటికీ కరోనా కేసుల తీవ్రత ఎంతమాత్రం తగ్గలేదు. కానీ, కరోనా నుంచి రికవరీ చాలా మంది కోలుకుంటున్నారు..



సాధారణంగా వ్యాధి సోకిన వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో వైద్యులు చెబుతున్నారు.. కోలుకున్న వ్యక్తిలో ఒకసారి నెగటీవ్ అని తేలిన తర్వాత వారిలో వ్యాధి ప్రభావం ఎంతకాలం ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఏమి చేయగలడు.. ఏం చేయకూడదో వైద్యులు సూచిస్తున్నారు.

రికవరీ సమయం :
కరోనా నుంచి రికవరీ సమయం అనారోగ్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికపాటి లక్షణాలతో కూడిన కేసులకు ప్రారంభం నుంచి క్లినికల్ రికవరీ వరకు సగటు సమయం సుమారు 2 వారాల వరకు ఉంటుంది. తీవ్రమైన లేదా క్లిష్టమైన కేసులకు మాత్రం 3-6 వారాలు సమయం పట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సోకిన వారిలో 1% మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

కరోనా సాధారణ లక్షణాల్లో జ్వరం, అలసట, పొడి దగ్గు కామన్.. కొంతమంది రోగుల్లో ఒళ్లు నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, గొంతు నొప్పి లేదా విరేచనాలు అవుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా స్వల్పంగా మొదలై క్రమంగా తీవ్రమవుతాయి.. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది. WHO ప్రకారం.. ప్రతి 6 మందిలో ఒకరు కరోనా సోకి శ్వాస కోశ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.



ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే రోగిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ తేలికపాటి కరోనా లక్షణాలతో చాలా మంది (సుమారు 80శాతం) ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా వ్యాధి నుంచి కోలుకుంటారు. వ్యాధి తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి ఇంట్లో 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లేదా హోం క్వారంటైన్ ఉండాల్సిన అవసరం ఉంది.

అత్యంత తీవ్రమైన కరోనా కేసుల్లో చికిత్స :
ఆస్పత్రిలో చేరిన రోగులలో సగానికి పైగా ఆక్సిజన్‌తో సాయం అవసరం అవుతుంది. సాధారణంగా ప్రైమరీ ఆస్పత్రి వార్డుల్లో కొంతమంది రోగులు తీవ్రమైన శ్వాస సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో కూడా చికిత్స అవసరం పడొచ్చు.

ఐసియులో ముక్కు ద్వారా ఆక్సిజన్ వంటి కృత్రిమ శ్వాసను అందిస్తూ వివిధ చికిత్సలు ఇస్తారు. శ్వాస మరింత తీవ్రమవుతుంటే రోగి ఇంట్యూబేట్ అవుతారు. అప్పుడు నోటి ద్వారా విండ్‌పైప్‌లోకి ఒక గొట్టం వెస్తారు. ఆపై వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తారు. ఇంట్యూబేటెడ్ రోగులకు ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందిస్తూ కోలుకునే వరకు మత్తులోనే ఉంటారు.



చాలా తీవ్రమైన సందర్భాల్లో, ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితికి extracorporeal membrane oxygenation అవసరం. సాధారణంగా గుండె ఊపిరితిత్తులు చేసే పనిని ఎక్స్ ట్రనల్ మిషన్‌కు అవుట్‌సోర్సింగ్ చేస్తుంది. లైఫ్ సపోర్ట్ కోసం అత్యంత అధునాతన టెక్నాలజీతో
రూపొందించారు. ఇలా చేయడం ద్వారా రికవరీ సమయం చాలా రోజులు పడుతుంది.

కరోనా వస్తే.. ఐసోలేషన్ ఎప్పుడు ఉండాలి?
సాధారణ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా ప్రారంభ లక్షణాలకు 14 రోజుల సమయం పడుతుంది.. లక్షణాలు 72 గంటలు ఉండకూడదు.. రోగులు రెండు పరీక్షలలో కూడా నెగటివ్ రావల్సి ఉంటుంది. శాంపిల్స్ కనీసం 24 గంటల వ్యవధిలో సేకరిస్తారు. సెల్ఫ్ ఐసోలేషన్ తరువాత, బయటి ప్రదేశాలకు తిరిగి వచ్చే కోలుకున్న రోగులు తమ శాంపిల్స్ తీసుకోవడం, చేతులు కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలి.



కోలుకున్నవారిలో ఎంతకాలం సోకకుండా ఉంటుంది?
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో ఎంతకాలం వైరస్ ఉంటుందో చెప్పడానికి తగినంత డేటా లేదు. రోగులు నెగటీవ్ పరీక్షలు చేసిన తర్వాత కూడా మలం శాంపిల్స్ ద్వారా వైరస్ గుర్తించే అవకాశం ఉంది. వైరస్ నుంచి RNAను ఒక మెటా-అధ్యయనం కనుగొంది. RNA యాక్టివ్ వైరస్ కణాలు మాత్రమే కాదా అనేది పరిశోధకులకు స్పష్టంగా తెలియదు. జ్వరం తగ్గినప్పుడు సాధారణంగా అంటువ్యాధులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

కోలుకున్న రోగుల్లో రోగనిరోధక శక్తి ఎంతకాలం?
కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పూర్తి స్థాయిలో ఉంటుందో లేదో కచ్చితంగా చెప్పలేమని సీడీసీ స్పష్టం చేసింది. SARS, MERS, కాలానుగుణ కరోనావైరస్‌లకు రోగనిరోధక శక్తి ఆధారంగా, నిపుణులు చాలా మంది, దాదాపు అందరూ, SARS-CoV-2 బారిన పడినవారికి ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం రోగనిరోధక శక్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు..