జపాన్ నౌకలో భారతీయులు సేఫ్.. 64 మందికి కరోనా లేదు

జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్ లో మొత్తం 3700 మంది ఉండగా, వారిలో 64 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అందుకని జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు వద్ద ఓడను నిలిపివేశారు. అందులోని ప్రయాణికులను కూడా అందులోనే ఉంచారు. అయితే ఈ ఓడలో సుమారు 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందులో ఏ భారతీయుడికీ కూడా కరోనా వైరస్ లేదని వైద్య పరీక్షల్లో తేలింది.
ఇక కరోనా వైరస్ ఉన్నవారు కూడా ఓడలేనే ఉండటంతో భారతీయ ప్రయాణికులతోపాటు ఇతరు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను వెంటనే కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి తమను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ ఓడలో ఉన్న ఏ భారతీయునికీ కరోనా వైరస్ లేదని.. కరోనా వైరస్ ఉన్నవారితో ఉండటం వల్ల తమకు కూడా వచ్చే అవకాశం ఉందని.. అందుకే తమను వెంటనే కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 7, 2019)న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఈ విషయంపై స్పందించారు. డైమండ్‌ప్రిన్సెస్ అనే ఓడలో ఉన్న భారతీయులకు కరోనా వైరస్ లేదని తెలిసిందని, భారతీయులను కాపాడే విషయంపై తాము జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించామన్నారు.